Chennamaneni Ramesh Repose on his citizenship abolishment: పౌరసత్వం రద్దుపై మరోసారి హైకోర్టును ఆశ్రయిస్తా: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్

  • కోర్టు నిర్దేశకాలను కేంద్ర హోం శాఖ పరిగణనలోకి తీసుకోలేదు
  • సెక్షన్ 10.3 ఉపేక్షిస్తూ నిర్ణయం వస్తే..తమ వద్దకు రావచ్చని హైకోర్టు చెప్పింది
  • న్యాయం జరుగుతుందన్న విశ్వాసముందన్న చెన్నమనేని

కేంద్ర హోం శాఖ తన పౌరసత్వం రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ స్పందించారు. హోం శాఖ ప్రకటన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘పౌరసత్వ పరిరక్షణకు మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తా. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను హోం శాఖ పరిగణనలోకి తీసుకోకపోవడం శోచనీయం’ అన్నారు.

2017లో హోం శాఖ తన పౌరసత్వం రద్దుచేసిన తర్వాత హైకోర్టు స్టే ఇచ్చిందన్నారు. అనంతరం సుప్రీం కోర్టు విచారణలో భాగంగా సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయన్నారు. ఈ ఏడాది జులై 15న తన పౌరసత్వం రద్దును అపెక్స్ కోర్టు కొట్టివేసిందన్నారు.

పౌరసత్వ చట్టం, నిబంధనలు, నైతిక విలువలు, వ్యక్తి సామాజిక నిబద్ధతను పరిగణనలోకి తీసుకుని సెక్షన్ 10.3ని చూడాలని... సాంకేతికంగా వేరుచేసి చూడరాదని హైకోర్టు తన తీర్పులో పేర్కొందని చెప్పారు. హోం శాఖ తన విచారణలో ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని కూడా కోర్టు ఆదేశించిందన్నారు.

ఒకవేళ సెక్షన్ 10.3 ఉపేక్షించి ఏ నిర్ణయం వెలువడ్డా న్యాయం కోసం మళ్లీ  తమ వద్దకు రావచ్చని హైకోర్టు పేర్కొన్న వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉటంకించారు. హైకోర్టు ఆదేశాల మేరకే అక్టోబర్ 31న ఢిల్లీలో మరోసారి వాదనలు జరిగినప్పటికి.. హైకోర్టు ఆదేశాలను హోం శాఖ పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు. 'హైకోర్టును మళ్లీ ఆశ్రయిస్తా.. న్యాయం జరుగుతుందని విశ్వాసముంది' అని ఆయన చెప్పారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News