Cyber crime: సైబర్ నేరాలు చేస్తున్న జార్ఖండ్ ముఠా సభ్యులు అరెస్టు
- అమెజాన్, స్విగ్గీ, ఫుడ్ పాండా పేరిట మోసం
- ఈ-వ్యాలెట్, యూపీఐ కోడ్స్ ద్వారా మోసం చేస్తున్నారు
- ఐదుగురిని అరెస్టు
సైబర్ నేరాలకు పాల్పడుతున్న జార్ఖండ్ ముఠా సభ్యులను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అమెజాన్, స్విగ్గీ, ఫుడ్ పాండా వంటి సంస్థల పేరిట ఫోన్ నెంబర్లను ఇంటర్ నెట్ లో పెట్టి మోసాలకు పాల్పడుతున్న ఐదుగురిని అరెస్టు చేసినట్టు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు.
ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ-వ్యాలెట్, యూపీఐ కోడ్స్ ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేయడంతో ఈ-వ్యాలెట్ సిస్టమ్ లోకి మారి, చాలా సులభంగా వీరు మోసాలకు పాల్పడుతున్నట్టు చెప్పారు. స్విమ్ స్వైపింగ్ చేయడంలో నిందితులు దిట్ట అని, రకరకాల పద్ధతుల్లో మోసాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు.