cm: సామాన్యుడికి ఉన్న అవగాహన మన ముఖ్యమంత్రికి లేకుండాపోయింది!: నారా లోకేశ్

  • ఓ వీడియోలో జగన్ పై విమర్శలు చేస్తున్న ఒక వ్యక్తి
  • ఆ వీడియోను పోస్ట్ చేసిన లోకేశ్
  • సంపద ఎలా సృష్టించాలో చంద్రబాబుకు తెలుసు

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ మరోమారు విమర్శలు చేశారు. ప్రభుత్వ భూముల అమ్మకంపై ఒక సామాన్యుడికి వున్న అవగాహన ముఖ్యమంత్రి జగన్ కు లేదంటూ ఓ వ్యక్తి విమర్శిస్తున్న వీడియోను పోస్ట్ చేశారు.

‘సంపద ఎలా సృష్టించాలో ముందు తెలుసుకోవాలి. ఉన్న భూములు అమ్మి సంపద సృష్టించడం ఇంపాజిబుల్.. అది జరగదు. ఇండస్ట్రీస్ తేవాలి, పెట్టుబడులు రావాలి. దాని ద్వారా సంపద సృష్టించి ప్రజలకు పంచాలి. ఉన్న భూములమ్మి డెవలప్ చేయడం జరగదు.. అది ఆయన చేతగాని తనం. సంపద సృష్టించడం తెలియదు కాబట్టే ఆయన ఈ నిర్ణయం ఎంచుకున్నాడు. సంపద ఎలా సృష్టించాలో, బిల్డప్ చేయాలో, రాష్ట్రాన్ని ఎలా ముందుకు నడపాలో చంద్రబాబునాయుడుకు తెలుసు. ఆయన (చంద్రబాబు) ముందు ఈయన ఎంత? ఆయన సీనియార్టీలో ఈయన సీనియార్టీ ఎంత?..’ అంటూ ఈ వీడియోలో ఓ వ్యక్తి విమర్శలు గుప్పించాడు.

cm
jagan
Telugudesam
Nara Lokesh
lands
  • Loading...

More Telugu News