Sarad Pawar: శరద్ పవార్ కు రాష్ట్రపతి పదవిని ఆఫర్ చేసిన బీజేపీ?

  • తదుపరి రాష్ట్రపతి పదవిపై నేడు చర్చలు!
  • సాయంత్రం సోనియా గాంధీని కలవనున్న పవార్
  • బీజేపీకి మద్దతుపై నేడు స్పష్టత

మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతిస్తే, తదుపరి రాష్ట్రపతిగా శరద్ పవార్ కు చాన్స్ ఇస్తామన్న భారీ ఆఫర్ ను బీజేపీ ఇచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. ఎటువంటి అధికారిక ప్రకటనా, సమాచారం లేకున్నా, దీన్ని గురించి చర్చించేందుకే మోదీని పవార్ కలవనున్నారని తెలుస్తోంది. అయితే, మహారాష్ట్రలో రైతుల సమస్యల గురించి ప్రధానితో మాట్లాడేందుకు మాత్రమే పవార్ న్యూఢిల్లీకి వెళ్లారని ఎన్సీపీ చెబుతోంది. కాగా, మోదీని కలిసిన తరువాత, సాయంత్రం సోనియా గాంధీని శరద్ పవార్ కలవనున్నారు. ఇక బీజేపీకి మద్దతిచ్చేందుకు ఎన్సీపీ అధినేత అంగీకరిస్తారా? అన్న విషయమై నేటి సాయంత్రంలోగా స్పష్టత వస్తుందని సమాచారం.

Sarad Pawar
Narendra Modi
President Of India
BJP
Maharashtra
  • Loading...

More Telugu News