dog: శునకాల పదవీ విరమణ.. ఘనంగా వీడ్కోలు పలికిన సీఐఎస్‌ఎఫ్

- ఎనిమిదేళ్లుగా ఢిల్లీ మెట్రో పారామిలిటరీ విభాగంలో సేవలు
- ఇప్పుడు ఎన్జీవోలకు అప్పగిస్తోన్న సిబ్బంది
- జాగిలాలను పతకాలతో సత్కరించిన అధికారులు
ఢిల్లీలోని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ( సీఐఎస్‌ఎఫ్) కే9 యూనిట్ సిబ్బంది.. జాగిలాల వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇవి ఎనిమిదేళ్లుగా ఢిల్లీ మెట్రో పారామిలిటరీ విభాగంలో పనిచేశాయి. వాటిని ఇప్పుడు ఎన్జీవోలకు అప్పగిస్తున్నారు. ఈ సందర్భంగా పతకాలతో వాటిని సత్కరించారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐఎస్‌ఎఫ్ తమ అధికారికి ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. వాటికి మెమొంటోలు, సర్టిఫికెట్లు ప్రదానం చేసినట్లు వివరించింది.


