YSRCP: రౌడీ షీటర్లు, రేపిస్టులు 70 శాతం ఉన్న పార్టీ వైసీపీ మాత్రమే అని సర్వే సంస్థలు తెలిపాయి: బుద్ధా వెంకన్న

  • ఈ విషయాన్ని మర్చిపోయారా విజయసాయి రెడ్డి గారూ?
  • జర్నలిస్టులను కొట్టిన వైకాపా ఎమ్మెల్యేకి సన్మానాలు చేశారు
  • ఎంపీడీఓ సరళగారిపై దాడి చేసిన ఎమ్మెల్యేకి రివార్డు ఇచ్చారు
  • ఆయన మార్గంలో నడవమని కార్యకర్తలకు హితబోధ చేశారు

'మాజీ రౌడీ షీటర్, తహసీల్దార్ వనజాక్షిపై దాడి చేసిన దుశ్శాసనుడు చింతమనేని ప్రభాకర్‌ను ప్రజలంతా ఆదర్శంగా తీసుకోవాలట' అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుకి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చురకలంటించిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు.  

'రౌడీ షీటర్లు, ఖూనికోర్లు, రేపిస్టులు 70 శాతం ఉన్న పార్టీ దేశంలో ఒక్క వైకాపా మాత్రమే అని సర్వే సంస్థలు ఇచ్చిన రిపోర్టుల గురించి మర్చిపోయారా విజయసాయి రెడ్డి గారూ? జర్నలిస్టులను చచ్చే వరకూ కొట్టిన వైకాపా ఎమ్మెల్యేకి సన్మానాలు, ఎంపీడీఓ సరళగారిపై దాడి చేసిన ఎమ్మెల్యేకి రివార్డు ఇచ్చి వారి మార్గంలో నడవమని కార్యకర్తలకు హితబోధ చేసిన నీచ సంస్కృతి మీ జగన్ గారిది' అని బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు.
 
'పోలీసులను రాజకీయ కక్ష సాధింపు కోసం వాడుకుంటున్న ముఖ్యమంత్రిగా జగన్ గారు చరిత్రలో నిలిచిపోయారు. ఇక పోలీస్ స్టేషన్లకు వైకాపా రంగులు, పోలీసులకు వైకాపా రంగులతో యూనిఫామ్ కుట్టిస్తారు అని ప్రచారం జరుగుతోంది. మీరే ధ్రువీకరించాలి విజయ్ గారు' అని మరో ట్వీట్ లో విమర్శించారు.

YSRCP
budda venkanna
Telugudesam
  • Loading...

More Telugu News