sharad pawar: అందుకే మోదీతో శరద్ పవార్ భేటీ అవుతున్నారు: శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్

  • మోదీని పవార్ కలిస్తే తప్పేంటి
  • మహారాష్ట్రలో రైతు సమస్యలను వివరించేందుకే భేటీ
  • వారం రోజుల్లో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం
  • దేశం మొత్తానికి మోదీ ప్రధాని 

ప్రధాని నరేంద్ర మోదీతో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ కానున్నారు. ఈ విషయంపై శివసేన నేత సంజయ్ రౌత్ స్పందించారు. మోదీని పవార్ కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. మహారాష్ట్రలో రైతు సమస్యలను వివరించేందుకే ప్రధానితో పవార్ భేటీ కానున్నారని తెలిపారు. వీలైనంత ఎక్కువ నిధులు, కేంద్ర సాయం పొందేందుకే కృషి చేస్తామన్నారు. డిసెంబరు మొదటి వారంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇందుకోసం వారం రోజుల్లో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు.

మరో రెండు రోజుల్లో పార్టీలకు అతీతంగా ప్రధాని మోదీ వద్దకు వెళ్లి రైతుల సమస్యలపై చర్చిస్తామని సంజయ్ రౌత్ తెలిపారు. మోదీని శరద్ పవార్ కలవడంలో మరో ఉద్దేశం ఏదీ లేదని చెప్పారు. దేశం మొత్తానికి మోదీ ప్రధాని అని అన్నారు. శరద్ పవార్ తో పాటు తమ పార్టీ అధినేత ఉద్ధవ్ థాకరే కూడా ఎల్లప్పుడూ రైతుల సమస్యల పరిష్కారం గురించే ఆలోచిస్తారని చెప్పారు.

  • Loading...

More Telugu News