Ramanaidu Studios: రామానాయుడు స్టూడియోపై ఐటీ దాడులు.. టాలీవుడ్ లో కలకలం!

  • గత నాలుగేళ్లుగా లెక్కల్లో తేడాలు
  • దాడులు చేస్తున్న హైదరాబాద్ ఐటీ వింగ్ అధికారులు
  • తనిఖీలతో టాలీవుడ్ లో కలకలం

ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబుకు చెందిన రామానాయుడు స్టూడియోపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించడం కలకలం రేపింది. సంస్థకు చెందిన పలు కార్యాలయాల్లో ఈ ఉదయం నుంచి అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇటీవల సురేశ్ ప్రొడక్షన్స్ నిర్వహించిన లావాదేవీలకు సంబంధించిన దస్త్రాలను అధికారులు పరిశీలిస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్ ఐటీ వింగ్ అధికారులు ఈ దాడుల్లో పాల్గొన్నారు. గడచిన నాలుగేళ్లుగా సురేశ్ ప్రొడక్షన్స్ చూపుతున్న లెక్కల్లో తేడాలు ఉన్నట్టుగా గుర్తించిన అధికారులు, ఈ తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తోంది. రామానాయుడు స్టూడియోస్ లో ఐటీ దాడులపై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News