Ranga Reddy District: వేడివేడి సాంబారులో పడి మూడేళ్ల చిన్నారి మృతి

  • రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో ఘటన
  • బంధువుల ఇంట్లో జరిగే వేడుకకు వెళ్లిన బాధిత కుటుంబం
  • ఆడుకుంటూ సాంబారు గిన్నెలో పడిన చిన్నారి

వేడివేడి సాంబారులో పడి మూడేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా టేక్మాల్ మండలంలోని శేరిపల్లికి చెందిన సురేశ్ 8 నెలల క్రితం షాబాద్ మండలంలోని సర్దార్ నగర్ వచ్చి ఉంటున్నాడు.

ఈ నెల 18న గ్రామంలోని వారి బంధువుల ఇంట్లో జరిగిన వేడుకకు భార్యాపిల్లలతో కలిసి వెళ్లాడు. అక్కడ ఇతర పిల్లలతో కలిసి సురేశ్ మూడున్నరేళ్ల కుమారుడు ఆరుష్ ఆడుకుంటుండంగా అక్కడ సిద్ధం చేసిన వేడివేడి సాంబారు గిన్నెలో ప్రమాదవశాత్తు పడిపోయాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆరుష్‌ను వెంటనే షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రాథమిక చికిత్స అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఉస్మానియాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆరుష్ నిన్న మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Ranga Reddy District
Crime News
boy
  • Loading...

More Telugu News