English: అలా మాట్లాడాననడం పచ్చి అబద్ధం: వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు

  • నేనసలు ఇంగ్లిష్ అన్న పదమే వాడలేదు
  • తెలుగు అకాడమీ నిధులు ఆగిపోయాయని మాత్రమే అన్నా
  • నన్నెవరూ వివరణ అడగలేదు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న ఇంగ్లిష్ మాధ్యమానికి వ్యతిరేకంగా తాను మాట్లాడినట్టు వస్తున్న వార్తలను వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఖండించారు. తాను అలా మాట్లాడానని చెప్పడం పచ్చి అబద్ధమన్నారు. నిజానికి తానసలు ఇంగ్లిష్ అన్న పదమే వాడలేదని స్పష్టం చేశారు. ఇంగ్లిష్‌కు తాను వ్యతిరేకం కాదన్న ఎంపీ.. తెలుగు భాష కోసం గత ప్రభుత్వం ఏమీ చేయలేదని మాత్రమే చెప్పానని గుర్తు చేశారు.

తెలుగు భాషను ప్రేమించడం తప్పయితే తాను ఏ శిక్షకైనా సిద్ధమేనని రఘురామకృష్ణంరాజు అన్నారు. తెలుగు అకాడమీ విభజన ఆగిపోవడంతో నిధులు ఆగిపోయాయని మాత్రమే పార్లమెంటులో మాట్లాడానని వివరణ ఇచ్చారు. తెలుగు భాషను తాను ప్రేమిస్తానని పేర్కొన్న ఆయన.. తనను ఎవరూ సంజాయిషీ అడగలేదని, అడిగితే ఇస్తానని పేర్కొన్నారు.

English
Telugu
YSRCP
Raghuramakrishnamraju
  • Loading...

More Telugu News