Andhra Pradesh: మా మావయ్యను వ్యక్తిగతంగా దూషిస్తే ఊరుకునేది లేదు!: నందమూరి చైతన్య కృష్ణ వార్నింగ్

  • విధాన పరంగా అభ్యంతరాలుంటే విమర్శించుకుంటే పరవాలేదు
  • వ్యక్తిగతంగా దూషిస్తే ఊరుకోను
  • వైసీపీ నేతలపై చైతన్య కృష్ణ ఆగ్రహం

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై వైసీపీకి చెందిన మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీలు అనవసర విమర్శలు చేస్తున్నారని నందమూరి జయకృష్ణ తనయుడు చైతన్యకృష్ణ వ్యాఖ్యానించారు. పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించిన వ్యక్తిపై వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదన్నారు. ఈ మేరకు చైతన్యకృష్ణ ఓ వీడియోను విడుదల చేశారు. ‘కొడాలి నాని, వంశీ ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నారంటే దానికి కారణం మా మావయ్య చంద్రబాబు. అది మరిచి నోటి కొచ్చినట్లు దూషిస్తే సహించేది లేదు. విధి విధానాల పరంగా ఏమైనా అభ్యంతరాలుంటే విమర్శించుకోండి. అంతేకాని వ్యక్తిగతంగా దూషిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు’ అని మండిపడ్డారు.

Andhra Pradesh
Nandamuri Chaithanya Krishna
support to Chanda babu Naidu
  • Loading...

More Telugu News