Chandrababu: చంద్రబాబు అడుగుజాడల్లోనే జగన్ నడుస్తున్నారు!: బీజేపీ నేత మాణిక్యాలరావు

  • టీడీపీ హయాంలో అవినీతి జరిగిందని ఆరోపించారు
  • అధికారంలో ఉన్నారుగా.. విచారణ జరపరే?
  • అవినీతి అంశంలో టీడీపీ, వైసీపీ ఒక్కటయ్యాయి

ఏపీ సీఎం జగన్ పై బీజేపీ నేత మాణిక్యాలరావు విమర్శలు గుప్పించారు. శ్రీకాకుళం జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, మాజీ సీఎం చంద్రబాబు అడుగుజాడల్లోనే జగన్ నడుస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని జగన్ ప్రచారం చేశారని, అధికారంలోకి వచ్చిన ఆయన టీడీపీ అవినీతిపై ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. అవినీతి అంశంలో టీడీపీ, వైసీపీ ఒక్కటయ్యాయన్న అనుమానం వుందని వ్యాఖ్యానించారు.  

ఆ ఘనత సీఎం జగన్ కే దక్కుతుంది

ఏపీలో ఇసుక కొరతపై ఆయన స్పందిస్తూ, ఉపాధి లేక లక్షలాది భవన కార్మికులు అల్లాడుతున్నారని, ఆకలితో అలమటిస్తున్నారని, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించిందని మాణిక్యాలరావు మండిపడ్డారు. ఈరోజున ఏపీలో విచిత్ర పరిస్థితి నెలకొందని, తమ తాడేపల్లిగూడెంలో అయితే ఇసుక బస్తాలను ఇంట్లో పెట్టి తాళం వేసిపోతే, ఆ తాళాన్ని బద్దలు కొట్టి నాలుగు ఇసుక బస్తాలను దొంగిలించుకుపోయారని పోలీస్ స్టేషన్ లో ఓ కేసు నమోదైందని అన్నారు. ఇసుక విలువను కూడా బంగారం విలువకు సమానంగా చేసిన ఘనత కచ్చితంగా సీఎం జగన్ కే దక్కుతుందని సెటైర్ విసిరారు.

Chandrababu
jagan
BJP
Manikyalarao
  • Loading...

More Telugu News