Telugudesam: కేంద్ర హోంశాఖ సంప్రదింపుల కమిటీలో టీడీపీ ఎంపీకి స్థానం

  • అమిత్ షా అధ్యక్షతన హోంశాఖ సంప్రదింపుల కమిటీ
  • కమిటీలో సభ్యుడిగా కనకమేడలకు చోటు
  • మారుతున్న పరిస్థితులకు నిదర్శనం?

టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ కు కేంద్రంలో తగిన గుర్తింపు లభించింది. కేంద్ర హోంశాఖ సంప్రదింపుల కమిటీలో సభ్యుడిగా కనకమేడలను నియమించారు. ఈ కమిటీకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.

ఇటీవల బీజేపీ, టీడీపీ మధ్య సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్న నేపథ్యంలో ఓ టీడీపీ ఎంపీకి అమిత్ షా ఆధ్వర్యంలోని కమిటీలో స్థానం ఇవ్వడం ఆసక్తి కలిగిస్తోంది. కనకమేడల టీడీపీ న్యాయవిభాగం చీఫ్ గా సేవలందిస్తున్న విషయం తెలిసిందే. ఆయన స్వతహాగా న్యాయవాది. హైకోర్టులో పలు కేసుల్లో సమర్థంగా వాదనలు వినిపించిన ఘనత ఆయన సొంతం.

Telugudesam
Kanakamedala
Rajya Sabha
Amit Shah
  • Loading...

More Telugu News