ARjun Trailer Release: ‘అర్జున్ సురవరం’ చిత్రం ట్రైలర్ విడుదల

  • పంచ్ డైలాగులతో అదరగొట్టిన హీరో నిఖిల్
  • జతగా నటిస్తున్న లావణ్య త్రిపాఠి
  • ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం

యువ నటుడు నిఖిల్ నటించిన చిత్రం ‘అర్జున్ సురవరం’ ట్రైలర్ అందరినీ ఆకర్షిస్తోంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి టి.సంతోష్ దర్శకత్వం వహించగా, శ్యామ్ సీఎస్ సంగీతం అందించారు. నిఖిల్ ఈ చిత్రంలో అర్జున్ అన్న పేరున్న పాత్రికేయుడి పాత్రను పోషించారు. ట్రైలర్ లో నిఖిల్ నటన అదరగొట్టింది.

 సాఫీగా సాగిపోతున్న అర్జున్ జీవితంలో ఓ ఉప్పెన వచ్చి పడుతుంది. అర్జున్ ను వెంటనే అరెస్టు చేయాలి అన్న డైలాగ్ వినిపిస్తుంది... ఒకటి కాదు, రెండు కాదు రూ.13కోట్లు అంటూ పోలీసు అధికారి నిఖిల్ ను విచారిస్తూ కనిపిస్తారు. మరోవైపు ఒక బాధితుడిలా కాదు.. ఒక రిపోర్టర్ లా ఆలోచించాలి అని పోసాని హీరోలో ధైర్యం నింపడం కనిపిస్తోంది. ‘ఇది ప్రతి విద్యార్థికి నా సందేశం.. ఇది మన సమస్య, మనమే పరిష్కరించుకోవాలి’ అని నిఖిల్ చివర్లో చెప్పడం సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. కాగా, ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది.

ARjun Trailer Release
Nikhel Hero punch Dilague
  • Loading...

More Telugu News