Maharashtra: మహారాష్ట్ర పరిణామాలపై ఆరెస్సెస్ అధినేత అసంతృప్తి!
- మహారాష్ట్రలో సీఎం పీఠం కోసం కుమ్ములాట
- బీజేపీ, శివసేనలను తప్పుబట్టిన ఆరెస్సెస్ చీఫ్
- నాగ్ పూర్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ భగవత్
మహారాష్ట్రలో అధికారం కోసం బీజేపీ, శివసేన ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటూ కాలహరణం చేస్తుండడం పట్ల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. మహా రాజకీయ సంక్షోభంపై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ నాగ్ పూర్ లో మాట్లాడుతూ, అధికారం కోసం బీజేపీ, శివసేన గొడవ పడుతుండడాన్ని తప్పుబట్టారు. జరుగుతున్న పరిణామాలకు రెండు పార్టీలు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. స్వార్థం అనేది వినాశనానికి దారితీస్తుందని తెలిసినా, చాలా కొద్దిమంది మాత్రమే స్వార్థాన్ని వదిలేస్తారని వ్యాఖ్యానించారు. బీజేపీ, శివసేన మధ్య సుదీర్ఘ అనుబంధం ఉందని, అలాంటి నేపథ్యంలో రెండు పార్టీలు కుమ్ములాడుకోవడం సరికాదని, తాజా విభేదాలు రెండు పార్టీలకు నష్టమేనని అభిప్రాయపడ్డారు.