mamata banerjee: మమతా బెనర్జీ విమర్శలకు కౌంటర్ ఇచ్చిన అసదుద్దీన్ ఒవైసీ

  • నాపై మమత పలు ఆరోపణలు చేశారు
  • పశ్చిమ బెంగాల్ లో మా పార్టీ బలమైన శక్తిగా ఎదుగుతోంది
  • ఈ విషయం మమతా బెనర్జీ వ్యాఖ్యల ద్వారానే తెలుస్తోంది
  • మమతా బెనర్జీ తన భయాన్ని, నిరాశను బయటపెడుతున్నారు 

ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పరోక్షంగా విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఆమె చేసిన వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. పశ్చిమ బెంగాల్ లో ఏఐఎంఐఎం బలపడుతున్న నేపథ్యంలోనే ఆమె ఇటువంటి వ్యాఖ్యలు చేశారన్నారు. 'నాపై ఇటువంటి ఆరోపణలు చేస్తూ.. పశ్చిమ బెంగాల్ లో మా పార్టీ బలమైన శక్తిగా ఎదుగుతోందన్న విషయంపై అక్కడి ముస్లింలకు మీరు (మమతా బెనర్జీ) సందేశాన్ని ఇస్తున్నారు. మమతా బెనర్జీ చేస్తోన్న ఇటువంటి వ్యాఖ్యల ద్వారా ఆమెలోని భయం, నిరాశ బయటపడుతోంది' అని వ్యాఖ్యానించారు.

కాగా,  పశ్చిమ బెంగాల్ లోని కూచ్ బిహార్ లో ఇటీవల నిర్వహించిన ఓ ర్యాలీలో పాల్గొన్న మమతా బెనర్జీ ఈ సందర్భంగా మాట్లాడుతూ... 'హైదరాబాద్ కేంద్రంగా నడుస్తోన్న ఓ పార్టీ.. సామాజిక వర్గాల మధ్య విభేదాలు సృష్టిస్తోంది. ఇటువంటి అతివాద శక్తులను మైనార్టీలు నమ్మకూడదు. ఆ పార్టీ బీజేపీ నుంచి డబ్బు తీసుకుంటోంది' అని వ్యాఖ్యానించారు.

mamata banerjee
Asaduddin Owaisi
Hyderabad
West Bengal
  • Loading...

More Telugu News