Chiranjeevi: మెగాస్టార్ సినిమాకి మణిశర్మ సంగీతం?

  • సంగీత దర్శకుడిగా మణిశర్మకి మంచి పేరు 
  • బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించడంలో సిద్ధహస్తుడు
  • గతంలో చిరూకి హిట్ సాంగ్స్ ఇచ్చిన మణిశర్మ

తెలుగులో అగ్రస్థాయి సంగీత దర్శకులలో మణిశర్మ ఒకరు. అగ్రకథానాయకుల సినిమాలెన్నింటికో ఆయన పనిచేశారు. ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఆయన ఖాతాలో వున్నాయి. అయితే దేవిశ్రీ ప్రసాద్ .. తమన్ ధాటికి ఆయన కొంత వెనకపడ్డారు. అయితే ఇటీవల 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకి సంగీతాన్ని అందించిన ఆయన, ఆ సినిమా విజయంలో కీలకమైన పాత్రను పోషించారు.

అలాంటి మణిశర్మ తాజాగా మరో పెద్ద ప్రాజెక్టును దక్కించుకున్నారు. చిరంజీవి - కొరటాల సినిమాకి సంగీత దర్శకుడిగా ఆయన ఎంపిక జరిగినట్టుగా తెలుస్తోంది. ముందుగా ఈ ప్రాజెక్టుకి బాలీవుడ్ సంగీత దర్శకులను తీసుకోనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే వాళ్లు నేపథ్య సంగీతాన్ని అందించడానికి అంగీకరించలేదట. ఇటు సంగీతం .. అటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించడంలో మణిశర్మ సిద్ధహస్తుడు. అందువల్లనే ఈయనను తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. గతంలోను ఆయన చిరంజీవికి ఎన్నో హిట్ సాంగ్స్ ఇచ్చారు.  

Chiranjeevi
Koratala
Manisharma
  • Loading...

More Telugu News