Srikakulam District: వైసీపీ ఎన్నికల ప్రచారం పాటలు.. డ్యాన్స్‌లతో ఇరగదీసిన తహసీల్దార్

  • శ్రీకాకుళం జిల్లా భామిని మండలంలో ఘటన
  • వైసీపీ కార్యకర్తల వనభోజనాలు
  • వైరల్ అవుతున్న తహసీల్దార్ డ్యాన్స్ వీడియో

గత ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉపయోగించిన పాటలకు తహసీల్దార్ స్టెప్పులేసి ఇరగదీశారు. శ్రీకాకుళం జిల్లా భామినిలో జరిగిందీ ఘటన. సోషల్ మీడియాలో ఇప్పుడు తహసీల్దార్ డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది. కార్తీకమాసం సందర్భంగా నేరడి బ్యారేజ్ వద్ద వైసీపీ కార్యకర్తలు వనభోజనాలు ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి భామిని తహసీల్దార్ ఎస్.నర్సింహమూర్తి, ఇతర రెవెన్యూ సిబ్బంది హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ వైసీపీ పాటలు ప్లే చేశారు. ఈ పాటలకు తహసీల్దార్ ఉత్సాహంగా స్టెప్పులేశారు. కార్యకర్తలతో కలిసి మైమరిచిపోయి డ్యాన్స్ చేస్తున్న తహసీల్దార్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Srikakulam District
Bhamini
MRO Dance
YSRCP
  • Loading...

More Telugu News