Chandrababu: ఓ రౌడీషీటర్ తనకు స్ఫూర్తని చంద్రబాబు చెప్పడం దారుణం!: దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి

  • చింతమనేని ఓ రౌడీ షీటర్
  • ఇసుక, మట్టిని చింతమనేని దోచుకున్నారు
  • లోకేశ్ కు ముడుపులు పంపారు

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, చింతమనేని లాంటి రౌడీ షీటర్ తనకు స్ఫూర్తి అని చంద్రబాబు చెప్పడం దారుణమని విమర్శించారు.

పద్నాలుగేళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యల ద్వారా సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ఇసుక, మట్టిని దోచుకుని లోకేశ్ కు ముడుపులు పంపినందుకా చింతమనేనిని స్ఫూర్తిగా తీసుకున్నది? అంటూ మండిపడ్డారు. పోలీసులపై ప్రైవేట్ కేసులు వేస్తామన్న టీడీపీ నాయకుల బెదిరింపులకు ఎవరూ బెదరరని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పాలనపై ఆయన ప్రశంసలు కురిపించారు.

Chandrababu
Abbaiah chowdary
chintamaneni
mla
  • Loading...

More Telugu News