Shubi Jain: సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న వీడియో ఇదిగో!

  • ఎంబీఏ విద్యార్థిని వినూత్న ప్రచారం
  • ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద వాహనదారులకు జాగ్రత్తలు చెబుతున్న షుబీ
  • సామాజిక మాధ్యమాల్లో గుర్తింపు

మధ్యప్రదేశ్ లో ఓ ఎంబీఏ విద్యార్థిని చేపట్టిన ట్రాఫిక్ అవేర్ నెస్ ఉద్యమం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ అమ్మాయి పేరు షుబీ జైన్. ఇండోర్ నగరంలోని రోడ్లపై వాహనదారులకు జాగ్రత్తలు చెబుతూ వారిని సురక్షితంగా ఉండాలని హితబోధ చేస్తుంది. షుబీ జైన్ చెప్పే విధానం ఓ సంగీత నృత్యరూపకం తరహాలో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

తన ప్రచార కార్యక్రమానికి కాస్తంత డ్యాన్స్ కూడా జోడించి షుబీ చేస్తున్న విజ్ఞప్తులకు వాహనదారులు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ముఖ్యంగా హెల్మెట్లు ధరించాలన్నది ఆమె చేపట్టిన కార్యక్రమం సారాంశం! ఆసక్తికర అంశం ఏమిటంటే, ఆమె నుంచి ట్రాఫిక్ కానిస్టేబుల్ స్ఫూర్తి పొందాడో ఏమో కానీ ఆయన కూడా డ్యాన్స్ మూమెంట్స్ తో ట్రాఫిక్ సిగ్నల్స్ ఇస్తూ దర్శనమిచ్చాడు.

Shubi Jain
Madhya Pradesh
Indore
Traffic
  • Error fetching data: Network response was not ok

More Telugu News