Chinthamaneni Prabhakar: మల్లయుద్ధమా, సాము గారడీనా... దేనికైనా రెడీ: చింతమనేనికి సవాల్ విసిరిన దెందులూరు ఎమ్మెల్యే తండ్రి

  • ఇటీవలే బెయిల్ పై విడుదలైన చింతమనేని
  • ఘాటు వ్యాఖ్యలు చేసిన కొఠారు రామచంద్రరావు
  • దమ్ముంటే తనతో తేల్చుకోవాలని సవాల్

టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జైలు నుంచి బెయిల్ పై బయటికి వచ్చిన నేపథ్యంలో దెందులూరు వైసీపీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి తండ్రి రామచంద్రరావు ఘాటుగా స్పందించారు. "ఇప్పటివరకు నువ్వు జైల్లో ఉన్నావని ఊరుకున్నా, సంక్రాంతికి చూసుకుందా రా!" అంటూ సవాల్ విసిరారు.

"మందీ మార్బలంతో చూసుకుందామా, సింగిల్ గా తేల్చుకుందామా! మల్లయుద్ధమా, సాముగారడీనా దేనికైనా నేను రెడీ! అయ్యప్ప మాల తీసేసి వస్తా, నీకు దమ్ముంటే రా!" అంటూ ఆవేశంగా అన్నారు. తాను చల్లగొళ్ల సూర్యనారాయణ కొడుకునని, యుద్ధాలు మొదలైంది, పుట్టి పెరిగింది, తమ ఇంట్లోనే, తమతోనే అంటూ సినీ ఫక్కీలో వ్యాఖ్యలు చేశారు. పెదవేగి మండలం జానంపేటలో మీడియాతో మాట్లాడుతూ ఆయన పైవిధంగా స్పందించారు.

Chinthamaneni Prabhakar
Kotaru Ramachandra Rao
Telugudesam
YSRCP
Andhra Pradesh
West Godavari District
  • Loading...

More Telugu News