Chintamaneni: చింతమనేని కుటుంబానికి అండగా ఉంటాం: చంద్రబాబు

  • చింతమనేనిని పరామర్శించిన చంద్రబాబు
  • అక్రమ కేసులకు ఎవరూ భయపడవద్దని వ్యాఖ్య
  • 67 రోజులు జైల్లో ఉన్న చింతమనేని

బెయిల్ పై విడుదలైన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను ఆ పార్టీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాలకు వెళ్లిన చంద్రబాబు... చింతమనేని కుటుంబీకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ, చింతమనేని కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. అక్రమ కేసులకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎవరూ భయపడొద్దని ధైర్యం చెప్పారు. వివిధ కేసులకు సంబంధించి ఏలూరు జిల్లా జైల్లో 67 రోజుల పాటు చింతమనేని ఉన్న సంగతి తెలిసిందే.

Chintamaneni
Chandrababu
Telugudesam
  • Loading...

More Telugu News