Ganta Srinivasa Rao: గంటా ఆస్తులు వేలం వేయాలని బ్యాంకు నిర్ణయం!

  • ఇండియన్ బ్యాంకు నుంచి భారీగా రుణం
  • బకాయిల కోసం బ్యాంకు ఒత్తిడి
  • డిసెంబరు 20న వేలం!

రాజకీయ భవితవ్యంపై ఊగిసలాడుతున్న నేతగా ప్రచారంలో ఉన్న మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చిక్కుల్లో పడ్డారు. గంటా పార్టీ మారుతున్నట్టు కొన్నిరోజులుగా కథనాలు వస్తున్నాయి. అయితే, ఆయనకు సంబంధించిన ఆస్తులను వేలం వేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇండియన్ బ్యాంక్ నుంచి గంటా ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరిట రూ.209 కోట్లు రుణం తీసుకున్నారు.

ఈ అప్పు నిమిత్తం రూ.35 కోట్ల విలువైన ఆస్తులు తనఖా పెట్టినా మిగిలిన బకాయిల కోసం బ్యాంకు గంటా ఆస్తుల వేలానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. రికవరీ కోసం వ్యక్తిగత ఆస్తులు స్వాధీనం చేసుకునే హక్కు బ్యాంకుకు ఉందని బ్యాంకు అధికారులు అంటున్నారు. డిసెంబరు 20న ఆయన ఆస్తుల వేలం ప్రక్రియ నిర్వహించనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో గంటా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తి కలిగిస్తోంది.

Ganta Srinivasa Rao
Indian Bank
Lone
Auction
Vizag
Telugudesam
  • Loading...

More Telugu News