shiv sena: ఉద్ధవ్ థాకరే అయోధ్య పర్యటన రద్దు

  • అయోధ్య వివాదాస్పద స్థలం హిందువులదేనని ఇటీవల తీర్పు
  • ఈ నెల 24న అయోధ్యకు వెళ్తానని ఉద్ధవ్ ప్రకటన
  • భద్రతా కారణాల దృష్ట్యా రద్దు

అయోధ్య వివాదాస్పద స్థలం హిందువులదేనని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. స్థలం స్వాధీనం చేసుకునేందుకు 3 నెలల్లో 'అయోధ్య ట్రస్ట్'ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 24న అయోధ్యకు వెళ్తానని, అలాగే, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీని కూడా కలుస్తానని శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ప్రకటన కూడా చేశారు.

అయితే, తాజాగా తన అయోధ్య పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా అయోధ్యలో ఉద్ధవ్ థాకరే పర్యటనకు భద్రతా సంస్థల నుంచి అనుమతి లభించలేదని ఆ పార్టీ నేత ఒకరు తెలిపారు. అయితే, మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు విషయంలో జరుగుతోన్న జాప్యం కూడా ఇందుకు మరో కారణమని తెలుస్తోంది. కాగా, బీజేపీతో శివసేనకు వచ్చిన విభేదాలతో ఆ పార్టీ కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. 

shiv sena
BJP
Maharashtra
  • Loading...

More Telugu News