Jagan: హిందువుల సొమ్మును జగన్ ప్రభుత్వం పాస్టర్లకు, ఇమామ్ లకు దోచిపెట్టేందుకు సిద్ధపడుతోంది: స్వామి శ్రీనివాసానంద సరస్వతి ఫైర్

  • శ్రీకాకుళం జిల్లాలో ఏపీ సాధుపరిషత్ హిందూ సమ్మేళనం
  • హిందువుల మనోభావాలను దెబ్బతీసే ప్రభుత్వాలకు బుద్ధి చెబుతామన్న శ్రీనివాసానంద సరస్వతి
  • వెంకన్నతో ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందన్న ఇస్కాన్

హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని పలువురు హిందూ స్వామీజీలు మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఏపీ సాధుపరిషత్ హిందూ సమ్మేళనానికి పలువురు స్వామీజీలు తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఆనందాశ్రమ పీఠాధిపతి స్వామి శ్రీనివాసానంద సరస్వతి మాట్లాడుతూ, హిందువులు కష్టపడి చెల్లిస్తున్న కోట్లాది రూపాయల పన్నుల నుంచి వైసీపీ ప్రభుత్వం పాస్టర్లకు, ఇమామ్ లకు నెలకు రూ. 5 వేలు దోచిపెట్టేందుకు సిద్ధమవుతోందని మండిపడ్డారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్న ప్రభుత్వాలకు బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

తిరుపతి ఇస్కాన్ ప్రతినిధి రాధా మనోహర్ దాస్ మాట్లాడుతూ, హిందువులు ఎంతో భక్తితో కొలిచే వేంకటేశ్వరస్వామితో కూడా ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.

Jagan
YSRCP
Swamy Sreenivasananda Saraswathi
Hindu
  • Loading...

More Telugu News