Lok Sabha: పార్లమెంట్‌ ముట్టడికి జేఎన్‌యూ విద్యార్థుల పిలుపు.. వర్సిటీలో భారీ బందోబస్తు

  • వసతి గృహాలు, మెస్‌ ధరల పెంపునకు నిరసన
  • భారీ ర్యాలీకి ప్రయత్నాలు   
  • వర్సిటీలో 144 సెక్షన్‌

ఢిల్లీలో జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. వసతి గృహాలు, మెస్‌ ధరల పెంపు, డ్రెస్‌కోడ్‌ విధింపు వంటి పలు అంశాలపై వారు కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు పార్లమెంట్‌ మార్చ్‌కు పిలుపునిచ్చారు.

భారీ ర్యాలీగా విద్యార్థులు బయలుదేరడంతో పార్లమెంట్‌ తో పాటు జేఎన్‌యూ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ వర్సిటీలో 144 సెక్షన్‌ విధించారు. 1,400 మంది అదనపు బలగాలను అక్కడకు తరలించారు. విద్యార్థులు ఆంక్షలు పట్టించుకోకుండా ర్యాలీ నిర్వహించడానికి ప్రయత్నించడంతో పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Lok Sabha
parliament
New Delhi
jnu
  • Loading...

More Telugu News