North Korea: అది 17 హిరోషిమా బాంబులతో సమానం: ఉత్తరకొరియా అణుపరీక్షపై ఇస్రో

  • 2017లో అణుపరీక్ష నిర్వహించిన ఉత్తరకొరియా
  • ఈ పరీక్షపై రీసెర్చ్ చేసిన ఇస్రో శాస్త్రవేత్తలు
  • అణుపరీక్ష వల్ల 245 నుంచి 241 కిలోటన్నుల శక్తి విడుదలైందని తెలిపిన ఇస్రో

2017లో ఉత్తరకొరియా నిర్వహించిన అణుపరీక్ష చాలా విధ్వంసకరమైనదని... జపాన్ లోని హిరోషిమాను ధ్వంసం చేసిన అణుబాంబుకన్నా 17 రెట్లు శక్తిమంతమైనదని ఇస్రో తెలిపింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు చెందిన కేఎం శ్రీజిత్, రితేశ్ అగర్వాల్, ఏఎస్ రాజావత్ లతో కూడిన ముగ్గురు సభ్యుల బృందం ఉత్తరకొరియా అణుపరీక్షపై అధ్యయనం చేసింది. వారి అధ్యయనానికి సంబంధించిన రీసెర్చ్ పేపర్ 'జియో ఫిజికల్ జర్నల్ ఇంటర్నేషనల్'లో ప్రచురితమైంది.

ఉత్తరకొరియా న్యూక్లియర్ టెస్ట్ వల్ల పరీక్ష నిర్వహించిన ప్రాంతంలోని భూ ఉపరితలం తీవ్ర మార్పులకు గురైందని వారు తమ అధ్యయనంలో తేల్చారు. మంటాప్ పర్వతం ఉపరితలం దాదాపు అర మీటర మేర మార్పుకు గురైందని చెప్పారు. జపాన్ శాటిలైట్ ఏఎల్ఓఎస్-2 డేటా ప్రకారం... అణుపరీక్ష వల్ల 245 నుంచి 241 కిలోటన్నుల శక్తి విడుదలైందని తెలిపారు. 1945లో హిరోషిమాపై జారవిడిచిన బాంబు కేవలం 15 కిలోటన్నుల శక్తిని మాత్రమే విడుదల చేసిందని చెప్పారు. మంటాప్ పర్వతం ఉపరితలానికి 542 మీటర్ల లోతున ఉత్తరకొరియా అణుపరీక్షను నిర్వహించిందని తేల్చారు.

  • Loading...

More Telugu News