Narendra Modi: గత కొన్ని రోజులుగా అన్ని పార్టీల నాయకులను కలుసుకునే అవకాశం కలిగింది: మోదీ

  • గత పార్లమెంటు సమావేశాలు అద్భుతంగా జరిగాయి
  • సభలో అన్ని అంశాలపై లోతైన చర్చ జరగాలి
  • పార్లమెంటు ప్రతిష్టను పెంచేందుకు సభ్యులంతా సహకరించాలి

ఈ ఏడాదికి ఇదే చివరి పార్లమెంటు సమావేశమని... ఈ శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని ప్రధాని మోదీ విన్నవించారు. పార్లమెంటు సమావేశాలకు ముందు పార్లమెంటు ప్రాంగణంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, గత కొద్ది రోజులుగా అన్ని పార్టీల నేతలను కలుసుకునే అవకాశం తనకు కలిగిందని చెప్పారు. ఎంపీలు అందరూ చురుగ్గా పాల్గొనడంతో, గత పార్లమెంటు సమావేశాలు అద్భుతంగా జరిగాయని తెలిపారు. ఆ క్రెడిట్ కేవలం అధికార పక్షానికే కాకుండా... పార్లమెంటు మొత్తానికి దక్కుతుందని అన్నారు.

భారత రాజ్యాంగానికి 70 ఏళ్లు పూర్తైన నేపథ్యంలో, రాజ్యాంగ దినోత్సవాన్ని కూడా జరుపుకోనున్నామని మోదీ తెలిపారు. సభలో అన్ని అంశాలపై లోతైన చర్చ జరగాలని కోరుకుంటున్నానని చెప్పారు. పార్లమెంటు ప్రతిష్టను పెంచేందుకు సభ్యులంతా సహకరించాలని విన్నవించారు.

Narendra Modi
Paliament Sessions
BJP
  • Loading...

More Telugu News