Rahul: రాహుల్ .. పునర్నవి జంటగా తెరపైకి ఓ ప్రేమకథ

  • 'బిగ్ బాస్ 3'తో వచ్చిన క్రేజ్ 
  • పున్నూతో నటిస్తానన్న రాహుల్ 
  • రంగంలోకి దిగిన నిర్మాత

రాహుల్ .. పునర్నవి 'బిగ్ బాస్' హౌస్ లో ఉండగానే కాదు, బయటికి వచ్చిన తరువాత కూడా వాళ్ల గురించే మాట్లాడుకుంటున్నారు. త్వరలో వాళ్లు పెళ్లి చేసుకోనున్నారనే టాక్ కూడా బలంగానే వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పునర్నవితో కలిసి నటించే అవకాశం వస్తే ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోనని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రాహుల్ చెప్పాడు.

దాంతో ఓ నిర్మాత ఈ జంటపై ఒక సినిమా చేయడానికి రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. ఈ ఇద్దరిపై ఒక ప్రేమకథను రూపొందించడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నాడని అంటున్నారు. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్న ఓ యువ దర్శకుడు ఈ సినిమాకి పనిచేయనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

  • Loading...

More Telugu News