Asaduddin Owaisi: జకీర్ నాయక్‌లా తయారవుతున్నారు: ఒవైసీపై కేంద్రమంత్రి ఫైర్

  • సుప్రీంకోర్టు తీర్పుపై అసదుద్దీన్ అసంతృప్తి
  • అతిగా మాట్లాడొద్దని హితవు పలికిన కేంద్రమంత్రి
  • చట్టం తన పని తాను చేస్తుందని హెచ్చరిక

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో విరుచుకుపడ్డారు. అయోధ్య భూ వివాదంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఒవైసీని ఉద్దేశించి కేంద్రమంత్రి మాట్లాడుతూ.. ఆయన రెండో జకీర్ నాయక్‌లా తయారవుతున్నారని వ్యాఖ్యానించారు. అతిగా మాట్లాడొద్దని హితవు పలికారు. మరోసారి అలా మాట్లాడితే చట్టం తన పని తాను చేసుకుపోతుందని హెచ్చరించారు.

అయోధ్య తీర్పు తర్వాత అసద్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు అత్యున్నతమైనదే అయినప్పటికీ దోషరహితమైనదేమీ కాదన్నారు. తన పోరాటం భూమి కోసం కాదని, న్యాయపరమైన హక్కుల కోసమని పేర్కొన్న అసదుద్దీన్.. సుప్రీం తీర్పుపై పలుమార్లు బాహాటంగానే తన అసంతృప్తిని వెళ్లగక్కారు.

Asaduddin Owaisi
Zakir naik
Ayodhya verdict
  • Loading...

More Telugu News