Varla Ramaiah: కొడాలి నాని బూతుల మంత్రి.... ఆ మాట పలకాలంటేనే నాకు చాలా ఇబ్బందిగా ఉంది: వర్ల వ్యాఖ్యలు

  • కొడాలి నానిపై వర్ల రామయ్య ధ్వజం
  • కొడాలి బూతుల మంత్రి అన్న విషయం అందరికీ తెలియాలన్న వర్ల
  • ఎన్టీఆర్ కుమార్తెను ఎందుకు దూషించావంటూ నిలదీసిన వైనం

ఇటీవలే ఏపీ మంత్రి కొడాలి నాని బూతులు మాట్లాడుతున్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా సందడి చేస్తోంది. తిరుమల శ్రీవారి సన్నిధిలో ప్రవేశించేముందు జగన్ సంతకం పెట్టాలన్న వివాదంపై నాని మాట్లాడుతూ, పరుష పదజాలంతో రెచ్చిపోయారు. దీనిపై వర్ల రామయ్య స్పందిస్తూ, కొడాలి నాని ఓ బూతుల మంత్రి అని విమర్శించారు. నాని ఏమన్నాడో ఆ మాటను నేను పలకలేకపోతున్నానని, చాలా ఇబ్బందిగా ఉందని వ్యాఖ్యానించారు.

"కొడాలి నాని బూతుల మంత్రి అని రాష్ట్ర ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఆయన రేపెక్కడికైనా వెళితే అరే మన బూతుల మంత్రి వచ్చాడు అని అందరూ అనుకోవాలి. ఈయన వస్తే భలే బూతులు మాట్లాడతారు, మనం కూడా కొత్త కొత్త బూతులు నేర్చుకోవచ్చని ప్రజలందరికీ తెలియాలి" అంటూ ఎద్దేవా చేశారు. అంతేకాకుండా, ఎన్టీఆర్ పై నీకు అంత ప్రేమే ఉంటే, ఆయనే నీకు దేవుడైతే ఆయన కుమార్తెను ఎందుకు దూషించావని నిలదీశారు. నీకు దైవ సమానుడైన వ్యక్తి కుమార్తెను ఎందుకు సమర్థించలేదని ప్రశ్నించారు.

అటు సన్నబియ్యం విషయంలో దేవినేని ఉమాపై కొడాలి వ్యాఖ్యలను కూడా వర్ల రామయ్య తీవ్రంగా తప్పుబట్టారు. దేవినేని ఉమా తల్లిదండ్రులను కించపరిచేలా నాని బూతులు మాట్లాడడం దారుణమని అన్నారు. నీ దుంపతెగ, నీకు మంత్రి పదవి ఇచ్చింది ఎవరయా! నీలాంటి వాడ్ని మంత్రిని చేసినందుకు జగన్ మోహన్ రెడ్డిని ముద్దాయిగా నిలబెట్టాలి అంటూ నిప్పులు చెరిగారు.

Varla Ramaiah
Kodali Nani
Telugudesam
YSRCP
Jagan
NTR
  • Loading...

More Telugu News