Yanamala: అసెంబ్లీలోనే స్పీకర్, బయటికి వస్తే కాదన్న తమ్మినేని వ్యాఖ్యలు సరికాదు: యనమల

  • స్పీకర్ తమ్మినేనిపై యనమల ధ్వజం
  • అనుచిత వ్యాఖ్యలు స్పీకర్ స్థానానికే కళంకం అని విమర్శలు
  • అందరి గౌరవం పొందాలని హితవు

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. స్పీకర్ గా అందరి గౌరవం పొందాల్సిన బాధ్యత తమ్మినేనిపై ఉందని అన్నారు. స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి నిరాధార ఆరోపణలు చేయడం తగదని, అలాంటి అనుచిత వ్యాఖ్యలు స్పీకర్ స్థానానికే కళంకం అని విమర్శించారు. స్పీకర్ గా ఓ గౌరవనీయ స్థానంలో ఉన్నప్పుడు దాని ఔన్నత్యాన్ని దెబ్బతీసే మాటలు మాట్లాడడం సబబు కాదన్నారు. శాసనసభలో ఉంటేనే స్పీకర్, బయట కాదని తమ్మినేని వ్యాఖ్యానించడాన్ని ఆయన విజ్ఞతకే వదిలివేస్తున్నట్టు తెలిపారు.

Yanamala
Thammineni
YSRCP
Telugudesam
Andhra Pradesh
  • Loading...

More Telugu News