rtc: ఆర్టీసీ నేత రాజిరెడ్డి ఇంటి తాళాలు రాడ్లతో పగులకొట్టి అదుపులోకి తీసుకున్న పోలీసులు
- రాజిరెడ్డి దీక్షను భగ్నం చేసిన పోలీసులు
- దీక్ష కొనసాగిస్తోన్న అశ్వత్థామరెడ్డి
- దీక్ష విరమించాలని కోరుతోన్న పోలీసులు
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేస్తోన్న సమ్మె 44వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ జేఏసీ నేతలు చేస్తోన్న నిరాహార దీక్షలు ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఎల్బీ నగర్ లోని తన నివాసంలో ఆయన దీక్ష చేస్తోన్న విషయం తెలిసిందే. ఆయన ఇంటి తాళాలను రాడ్లతో పగలకొట్టిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు, ఆర్టీసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి హైదరాబాద్ లోని హస్తినాపురంలోని తన ఇంట్లోనే నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. దీక్ష విరమించాలని ఆయనను పోలీసులు కోరుతున్నారు. ఈ రోజు ఉదయం నుంచి స్వీయ గృహనిర్బంధంలో ఆయన ఉన్నారు. ప్రభుత్వం తమతో చర్చించే వరకు దీక్షను కొనసాగిస్తానని చెప్పారు.