budda venkanna: సమాధానం చెప్పడానికి సిద్ధం.. కానీ, ఒక చిన్న కండిషన్: విజయసాయి రెడ్డి సవాల్ పై బుద్ధా వెంకన్న స్పందన

  • అన్నం తినేవాడు వైకాపాలో చేరడు అని గతంలో వంశీ అన్నారు
  • మరి మీరు అన్నం బదులు వేరేది తింటున్నామని ప్రకటిస్తారా?
  • 151మంది ఎమ్మెల్యేలు గెలిచినా అభద్రతాభావంతో ఉన్నారు

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వదిలిన సవాళ్లకు తెలుగుదేశం పార్టీ జవాబిచ్చే పరిస్థితిలో ఉందా? అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ కు టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్పందించారు.
 
గతంలో వైసీపీపై వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలను బుద్ధా వెంకన్న ప్రస్తావించారు. 'మీ పార్టీలో చేరిన నాయకుడి (వల్లభనేని వంశీ) సవాల్ కి సమాధానం చెప్పగలరా? అని ప్రశ్నించారు.. సమాధానం మేము చెప్పడానికి సిద్ధం కానీ ఒక చిన్న కండిషన్. అన్నం తినేవాడు వైకాపాలో చేరడు అని అదే నాయకుడు గతంలో అన్నారు. మరి మీరు అన్నం బదులు వేరేది తింటున్నామని ప్రకటిస్తే మేము సమాధానం చెప్పడానికి సిద్ధం' అని బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు.
 
ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం సాధించినప్పటికీ ఇప్పటికీ ఆ పార్టీలో అభద్రతా భావం ఉందని బుద్ధా వెంకన్న అన్నారు. '151మంది ఎమ్మెల్యేలు గెలిచిన తరువాత కూడా అభద్రతాభావంతో మా పార్టీ ఎమ్మెల్యేలను వైకాపాలో చేర్చుకుంటున్నాడు మీ తింగరి మాలోకం. ఎందుకు అంత భయం? చెత్త నిర్ణయాల కారణంగా మీరు, మీ తింగరి మాలోకం మాత్రమే పార్టీలో మిగులుతారు అనే భయమా విజయసాయి రెడ్డి గారు?' అని ప్రశ్నించారు. 

budda venkanna
Vijay Sai Reddy
YSRCP
Telugudesam
  • Loading...

More Telugu News