Sri Lanka: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం దిశగా గోటబయ రాజపక్స!

  • 54 శాతం వరకూ ఓట్లు
  • ప్రత్యర్థి సుజిత్ ప్రేమదాసకు 44.4 శాతం ఓట్లు
  • కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

దాదాపు పదేళ్ల క్రితం శ్రీలంకలో తమిళ పులులను సమూలంగా నిర్మూలించిన నాటి లెఫ్టినెంట్ కల్నల్ గోటబయ రాజపక్స, తాజాగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం దిశగా వెళుతున్నారు. 'టర్మినేటర్' అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే రాజపక్స కు ఈ ఎన్నికల్లో 53 నుంచి 54 శాతం వరకూ ఓట్లు వచ్చినట్టు ప్రాథమిక సమాచారం. ఆయనకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న అధికార పార్టీకి చెందిన సుజిత్ ప్రేమదాసకు 44.4 శాతం వరకూ ఓట్లు వచ్చినట్టు తెలుస్తోంది. శనివారం నాడు ఎన్నికలు జరుగగా, ఓట్ల లెక్కింపు కొనసాగుతోందని, 80 శాతం ఓట్లు పోల్ అయ్యాయని ఎలక్షన్ కమిషన్ చైర్మన్ మహీంద్ర దేశప్రియ వెల్లడించారు. నేటి రాత్రికి కౌంటింగ్ పూర్తవుతుందని భావిస్తున్నామని తెలిపారు. 

Sri Lanka
Presidents
Elections
  • Loading...

More Telugu News