Manda Krishna: హైదరాబాద్ కు వచ్చి రహస్యంగా లాడ్జ్ లో మకాం వేసిన మందకృష్ణ... తెలుసుకుని అరెస్ట్ చేసిన పోలీసులు!

  • మహాదీక్షను తలపెట్టిన ఎంఆర్పీఎస్
  • హబ్సిగూడలోని లాడ్జ్ లో మంద కృష్ణ మకాం
  • అరెస్ట్ చేసి నాచారం పీఎస్ కు తరలింపు

నేడు హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తలపెట్టిన మహా దీక్షకు హాజరయ్యేందుకు వచ్చిన మంద కృష్ణను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎలాగైనా దీక్షాస్థలికి వెళ్లాలన్న ఆలోచనతో ఉన్న ఆయన, రహస్యంగా హైదరాబాద్ కు చేరుకుని హబ్సీగూడలోని కృష్ణా లాడ్జ్ లో దిగారు. ఈ విషయాన్ని పసిగట్టిన పోలీసులు, నేటి ఉదయం లాడ్జ్ వద్దకు వెళ్లి, మంద కృష్ణను అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ వెంటనే ఆయన్ను నాచారం పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈ దీక్షకు అనుమతి లేదని స్పష్టం చేసిన ఉన్నతాధికారులు, ఇందిరా పార్క్ ప్రాంతానికి ఎవరూ రావద్దని హెచ్చరించారు.

Manda Krishna
Arrest
Nacharam
Maha Deeksha
  • Loading...

More Telugu News