Warangal Urban District: హన్మకొండ హత్యాచారం కేసులో... ఉరిశిక్షను యావజ్జీవంగా మార్చిన హైకోర్టు!

  • జూన్ 18న చిన్నారిపై హత్యాచారం
  • ఆగస్టు 7న ఉరిశిక్ష విధించిన వరంగల్ కోర్టు
  • శిక్షను తగ్గించిన హైకోర్టు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన హన్మకొండ చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడు ప్రవీణ్ కు శిక్ష తగ్గిస్తున్నట్టు హైకోర్టు పేర్కొంది. జూన్ 18న 9 నెలల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు, ఆపై పాపను హత్య చేశాడు. ఈ కేసును విచారించిన వరంగల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు, ఉరిశిక్షను విధించింది. కేసు తీర్పు ఆగస్టు 7న వెలువడగా, తనకు విధించిన ఉరిశిక్షను దోషి, హైకోర్టులో సవాల్ చేశాడు. కేసును విచారించిన న్యాయస్థానం, నిందితుడికి విధించిన శిక్షను యావజ్జీవ ఖైదుగా సవరిస్తూ తీర్పిచ్చింది.

Warangal Urban District
Rape
Case
High Court
  • Loading...

More Telugu News