Yamini Sadineni: గ్లామర్ తో రాజకీయాల్లో నెట్టుకురావడం నాకు తెలియదు: యామిని సాదినేని

  • హార్డ్ వర్క్ తోనే ఎదిగానన్న యామిని
  • సొంతపార్టీలోనే అసూయపడ్డారని వ్యాఖ్యలు
  • మీడియా చానల్ కు ఇంటర్వ్యూ

ఇటీవలే టీడీపీకి గుడ్ బై చెప్పిన ఫైర్ బ్రాండ్ మహిళా రాజకీయనేత యామిని సాదినేని ఓ మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కేవలం గ్లామర్ తో రాజకీయాల్లో ఎదగడంపై తనకు పెద్దగా క్లారిటీ లేదని తెలిపారు. తానేమీ ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ తెచ్చుకోలేదని, 2004 నుంచి సామాజిక సేవా రంగంలో, విపత్తు నిర్వహణ రంగంలో ఉన్నానని వెల్లడించారు.

హుదూద్ తుపాను సమయంలో చంద్రబాబు గారికి హ్యామ్ రేడియో ద్వారా తుపాను సమాచారం అందించానని వెల్లడించారు. 2014 ఎన్నికల సమయంలో మూడు నెలల పసిబిడ్డను కూడా వదిలేసి 13 జిల్లాలు బస్సుయాత్ర చేశానని వివరించారు. ఇంత కష్టపడ్డాను కాబట్టే, చంద్రబాబు గారు ఆ కష్టాన్ని గుర్తించి పదవి ఇచ్చి గౌరవించారని యామిని చెప్పారు.

తన ఎదుగుదలలో అందం, వాగ్ధాటి కాకుండా, తన హార్డ్ వర్క్ ఫలితాన్నిచ్చిందని స్పష్టం చేశారు. సొంత పార్టీలోనే తన ఎదుగుదలను భరించలేకపోయారని, దాంతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. ఈ విషయం తాను చంద్రబాబు గారికి తెలియజేసినా ఆయన ఎంతో బిజీగా ఉండడంతో చర్యలు తీసుకోలేకపోయారని తెలిపారు.

Yamini Sadineni
Telugudesam
Andhra Pradesh
  • Loading...

More Telugu News