Chandrababu: చింతమనేనితో ఫోన్ లో మాట్లాడిన చంద్రబాబు

  • కేసులను ధైర్యంగా ఎదుర్కోవాలని సూచన
  • పార్టీ అండగా ఉంటుందని భరోసా
  • పశ్చిమ గోదావరి పర్యటనలో కలుస్తానని వెల్లడి

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు ఫోన్ చేశారు. బెయిల్ పై బయటికి వచ్చిన చింతమనేనికి ఫోన్ చేసిన చంద్రబాబు వైసీపీ బనాయించిన అక్రమ కేసులను నిర్భయంగా ఎదుర్కోవాలని స్పష్టం చేశారు. సోమవారం తాను పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వస్తున్నానని, అక్కడ కలుసుకుందామని చింతమనేనితో చెప్పారు. టీడీపీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కేవలం 5 నెలల్లో చింతమనేనిపై 11 కేసులు పెట్టడం దారుణమని, ఒక వ్యక్తిపై 9 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం హేయమని అభిప్రాయపడ్డారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే, ఉద్దేశపూర్వకంగా ఈ అక్రమ కేసులు బనాయించారని చంద్రబాబు ఆరోపించారు.

Chandrababu
Chinthamaneni Prabhakar
Telugudesam
West Godavari District
  • Loading...

More Telugu News