Riliance Communications Directors Resigned: ఆర్ కామ్ డైరెక్టర్ పదవికి అనిల్ అంబానీ గుడ్ బై

  • అదే బాటలో ఇతర డైరెక్టర్లు
  • ఇప్పటికే రాజీనామా చేసిన సీఎఫ్ వో, డైరెక్టర్ మణికంఠన్ వి
  • దివాలా తీసి విక్రయానికి సిద్ధంగా ఉన్న ఆర్ కామ్

దివాలా తీసిన రిలయన్స్ కమ్యునికేషన్స్(ఆర్ కామ్) డైరెక్టర్ల రాజీనామాలతో మరింత చతికిలపడింది. ఈ కంపెనీ ఇప్పటికే విక్రయానికి సిద్ధంగా ఉందన్న విషయం తెలిసిందే. నిన్న విడుదల చేసిన రెండో త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో కూడా ఆర్ కామ్ రూ.30,142కోట్ల ఏకీకృత నష్టాలను నమోదు చేసింది.

 ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్ కామ్ డైరెక్టర్ అనిల్ అంబానీ తన పదవికి రాజీనామా చేశారని కంపెనీ తాజాగా ప్రకటించింది. ఆయనతోపాటు డైరెక్టర్లుగా ఉన్న చాయా విరాని, రైనా కరాణి, మంజరి కాకెర్, సురేశ్ రంగాచారి కూడా రాజీనామాలు చేశారు. కాగా కంపెనీ డైరెక్టర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మణికంఠన్ ఇప్పటికే రాజీనామా చేశారు. 

Riliance Communications Directors Resigned
Anil Ambani Resigned
R-Com
  • Loading...

More Telugu News