Chinthamaneni Prabhakar: నిన్ను జైల్లో వేస్తే నీ తల్లి, చెల్లి ఎలా తల్లడిల్లిపోయారు?... ఇతర పార్టీల వాళ్లు నీలాంటివాళ్లు కారా?: చింతమనేని

  • బెయిల్ పై బయటికొచ్చిన చింతమనేని
  • మీడియా సమావేశంలో వ్యాఖ్యలు
  • ఎంత చెట్టుకు అంత గాలి అంటూ విమర్శలు

టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బెయిల్ పై బయటికి వచ్చిన అనంతరం అధికార వైసీపీ, సీఎం జగన్ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. తనపై ఉన్న కేసులకు ఒకవేళ శిక్షపడితే ఆర్నెల్ల వరకు పడుతుందేమోనని, కానీ జగన్ పై ఎన్నో చార్జిషీట్లు ఉన్నాయని, శిక్ష పడితే ఆయనకు ఉండదా బాధ? అంటూ వ్యాఖ్యానించారు.

'ఏం, మీలాంటి మనసులు కావా ఇతర పార్టీల నేతలవి? మీలాంటి హృదయాలు కావా ఇతరులవి? ఆ రోజున నిన్ను జైల్లో వేస్తే నీ తల్లి, చెల్లి, కార్యకర్తలు, అభిమానులు ఎలా తల్లడిల్లిపోయారు? ఎంత చెట్టుకు అంత గాలి! నీది పెద్దచెట్టు కాబట్టి అంతగాలి, నాకుండే గాలి నాకుంటుంది కదా!' అంటూ చింతమనేని తీవ్రస్థాయిలో స్పందించారు.

Chinthamaneni Prabhakar
Andhra Pradesh
Telugudesam
YSRCP
Jagan
  • Loading...

More Telugu News