Nara Lokesh: లోకేశ్ ను నేను ఎప్పుడూ 'అన్న' అని పిలవలేదు: వల్లభనేని వంశీ

  • టీడీపీ నేతలు, వంశీ మధ్య మాటల యుద్ధం
  • లోకేశ్ పై వంశీ వ్యాఖ్యలు తగదంటూ టీడీపీ నేతల ఆగ్రహం
  • బదులిచ్చిన వంశీ

నారా లోకేశ్ ను 'అన్న, అన్న' అంటూ ఆపై విమర్శలు చేసినట్టు తనపై వస్తున్న కథనాలకు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వివరణ ఇచ్చారు. లోకేశ్ ను తానెప్పుడూ 'అన్న' అని పిలవలేదని స్పష్టం చేశారు. లోకేశ్ ను 'బాబు' అని పిలిచేవాడ్నని వంశీ వెల్లడించారు. గున్న ఏనుగు, పప్పు అని ఎన్నడూ అనలేదని తెలిపారు. ఆ మాటలన్నది ఎవడో రామ్ గోపాల్ వర్మ అయితే, నేను అన్నట్టుగా ప్రచారం చేస్తారేంటి? అంటూ వంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారసత్వ రాజకీయాలపై తనకు నమ్మకంలేదని వంశీ వ్యాఖ్యానించారు. కెపాసిటీ ఉంటేనే వారసత్వ రాజకీయాల్లోకి రావాలని అభిప్రాయపడ్డారు.

Nara Lokesh
Vallabhaneni Vamsi
Telugudesam
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News