Andhra Pradesh: సీఎం జగన్ ను ఇష్టారీతిన విమర్శిస్తే, బాబు కుటుంబం బండారాన్ని బయటపెడతా!: మంత్రి కొడాలి నాని హెచ్చరిక

  • చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన మంత్రి
  • నలబై ఏళ్లుగా మీ డ్రామాలు చూస్తున్నానంటూ ఎద్దేవా
  • ఇసుక, ఇంగ్లీష్, హిందూ తప్ప మాట్లడటానికి మీ వద్ద అంశాలు లేవు

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. సీఎం జగన్ పై విమర్శలు చేస్తే.. మీ బండారాన్ని బయటపెడతానని అన్నారు. ఈ రోజు రాష్ట్ర రాజధాని అమరావతిలో  మీడియాతో నాని మాట్లాడారు. జగన్ కుటుంబాన్ని విమర్శిస్తూ ఇష్టారీతిన మాట్లాడితే బాబు కుటుంబం బండారాన్ని బయటపెడతానని చెప్పారు. జగన్ చిటికేస్తే, టీడీపీని తీసుకొచ్చి స్టోర్ రూమ్ లో పెట్టిస్తామంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు తనయుడు లోకేష్ వల్లే టీడీపీలో సంక్షోభం ఏర్పడిందన్నారు.

టీడీపీ ఇసుక దీక్ష చేస్తే 23 మంది ఎమ్మెల్యేలకు 9 మందే వచ్చారని, అయినా దీక్ష విజయవంతమైందని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇసుక, ఇంగ్లీష్, హిందూ తప్ప మాట్లడటానికి టీడీపీ వద్ద ఏమీ లేవని చెప్పారు. చంద్రబాబు డ్రామాలు నలబైఏళ్లుగా చూస్తున్నానని విమర్శించారు. దేవినేని, యనమల లాంటి బ్రోకర్లతో మాట్లాడించొద్దని చెపుతూ.. పరుష పదజాలాన్ని వాడారు.

Andhra Pradesh
Criticism against Chandhrababu NAidu
Telugudesam
  • Loading...

More Telugu News