Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ వైసీపీలో చేరాలంటే పదవికి రాజీనామా చేయాల్సిందే: తమ్మినేని

  • ఢిల్లీలో స్పీకర్ల సబ్ కమిటీ సమావేశం
  • హాజరైన తమ్మినేని సీతారాం
  • రాజీనామా చేయకుండా పార్టీలో చేరితే చర్యలు తప్పవని వెల్లడి

సరికొత్త టెక్నాలజీ వినియోగంపై ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ స్పీకర్ల సబ్ కమిటీ సమావేశానికి ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏ ఎమ్మెల్యే అయినా పార్టీ మారాలంటే తప్పనిసరిగా రాజీనామా చేయాలని స్పష్టం చేశారు. రాజీనామా చేయకుండా పార్టీ మారితే చర్యలు తప్పవని అన్నారు. సభానాయకుడిగా సీఎం కూడా అదే చెప్పారని, దానికే కట్టుబడి ఉన్నామని తెలిపారు. వల్లభనేని వంశీకి కూడా ఇదే విధానం వర్తిస్తుందని, వంశీ వైసీపీలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సూచించారు.

Vallabhaneni Vamsi
Thammineni Sitharam
Andhra Pradesh
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News