Nara Lokesh: లోకేశ్ ను అన్నా, అన్నా అని పిలిచి ఆయనపైనే విమర్శలు చేస్తున్నారు: వర్ల రామయ్య

  • హైందవ ధర్మాన్ని అగౌరవపర్చుతున్నారని మండిపాటు
  • అయ్యప్ప మాల వేసుకుని నోటికొచ్చినట్టు మాట్లాడతారా?
  • దీక్ష చేపట్టినవాళ్లు నియంత్రణలో ఉండాలని హితవు

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ నుంచి వెళుతూ అధినేత చంద్రబాబుపైనా, యువనేత నారా లోకేశ్ పైనా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడం తెలిసిందే. దీనిపై టీడీపీ నేత వర్ల రామయ్య స్పందించారు. పార్టీలో ఉన్నప్పుడు లోకేశ్ ను అన్నా, అన్నా అని పిలిచి ఇప్పుడు ఆయనపైనే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

జగన్ తో కలిసి తప్పుడుగా మాట్లాడడం వంశీకి సరికాదని అన్నారు. అయ్యప్పమాల వేసుకుని అనకూడని మాటలు అనడం, కాళ్లకు చెప్పులు వేసుకోవడం హైందవ ధర్మాన్ని అగౌరవపర్చడేమనని అభిప్రాయపడ్డారు. వంశీ మనసును నియంత్రించుకోలేక, ఇష్టంవచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆరోపించారు. అయ్యప్పమాల వేసుకున్న వ్యక్తులు రాగద్వేషాలకు అతీతంగా ఉండాలని హితవు పలికారు.

Nara Lokesh
Varla Ramaiah
Telugudesam
Vallabhaneni Vamsi
Jagan
YSRCP
  • Loading...

More Telugu News