Andhra Pradesh: ద్విచక్ర వాహనంపై మంత్రి వెల్లంపల్లి విజయవాడలో సుడిగాలి పర్యటన

  • ప్రజాసేవకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి 
  • ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగిన వెల్లంపల్లి 
  • పర్యటనలో పాల్గొన్న నగర పాలక సంస్థ, పలుశాఖల ఉన్నతాధికారులు

 ప్రజా సేవకు వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఇందుకోసం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. ఈ రోజు మంత్రి విజయవాడలో స్కూటర్ పై సుడిగాలి పర్యటన జరిపారు. ఒక సాధారణ పౌరుడివలే ద్విచక్రవాహనంపై తిరుగూ.. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో ప్రజలు చూపిన అప్యాయతపై మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. 

ఈ క్రమంలో రోడ్డుపక్కన ఉన్న టీ బంకులో తేనీరు సేవించి స్థానికులతో ముచ్చటించారు. బ్రాహ్మణ వీధి నుంచి మొదలైన మంత్రి పర్యటన నెహ్రూ సెంటర్, సొరంగ ప్రాంతం, భవానీ పురం, ఊర్మిళ నగర్, కామకోటి నగర్, జోజీ నగర్, హెచ్ బి కాలనీ, శివాలయం వీధి మీదుగా కొనసాగింది. ఈ పర్యటనలో మంత్రితో పాటు నగర పాలక సంస్థ అధికారులు వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Andhra Pradesh
Endowment Minister vellampalli Srinivasrao
Vijayawada Bike Tour
  • Loading...

More Telugu News