Delhi: ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ.. టాప్ 10లో మూడు భారతీయ నగరాలు!
- 527 ఏక్యూఐ పాయింట్లతో అగ్రస్థానంలో ఢిల్లీ
- టాప్ 10లో ఢిల్లీ, కోల్ కతా, ముంబై
- రెండో స్థానంలో పాకిస్థాన్ లోని లాహోర్
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత కాలుష్య నగరంగా మన దేశ రాజధాని ఢిల్లీ అవతరించింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రీడింగ్ లో 527 పాయింట్లతో జాబితాలో ఢిల్లీ అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఈ వివరాలను స్కైమెట్ సంస్థ వెల్లడించింది. ఆ తర్వాతి స్థానాల్లో లాహోర్ (234), తాష్కెంట్ (185), కరాచీ (180), కోల్ కతా (161), చెంగ్డు (158), హనోయి (158), గ్వాంగ్ ఝౌ (157), ముంబై (153), కాట్మండూ (152)లు ఉన్నాయి. టాప్ టెన్ జాబితాలో మూడు భారతదేశ నగరాలు ఉండటం ఆందోళన కలిగించే అంశమే. ఢిల్లీలో ముఖ్యంగా లోధీ రోడ్, ఫరీదాబాద్, మోతీ నగర్, పశ్చిమ్ విహార్ ప్రాంతంల్లో ఎక్కువ కాలుష్యం ఉందని స్కైమెట్ తెలిపింది.