Telangana: తెలంగాణ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి... కేసీఆర్ ఆదేశాలు

  • త్వరలోనే సమితి సభ్యుల నియామకం
  • వచ్చే జూన్ లోగా రైతు సమన్వయ సమితుల బలోపేతం
  • రైతులను సంఘటిత శక్తిగా మార్చేందుకు ప్రయత్నం

రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని నియమించాలని తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు నియామక ప్రక్రియ చేపట్టి, వీలైనంత త్వరగా ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే రైతు సమన్వయ సమితి సభ్యులను కూడా నియమిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. వచ్చే జూన్ లోగా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రైతు సమన్వయ సమితులను బలోపేతం చేసి, రైతులను సంఘటిత శక్తిగా మార్చాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు.

విత్తనం వేయడం నుంచి, పంటకు గిట్టుబాటు ధర వచ్చేవరకు రైతులకు అన్నివిధాలా అండగా నిలిచేలా రైతు సమన్వయ సమితులను పటిష్టమైన పద్ధతుల్లో తీర్చిదిద్దాలన్నది కేసీఆర్ ప్రణాళిక అని తెలంగాణ సీఎంఓ ట్విట్టర్లో పేర్కొంది.

Telangana
TRS
Palla Rajeshwar Reddy
KCR
  • Loading...

More Telugu News