Dharmana Krishnadas: ఒక్క రూపాయి అవినీతికి పాల్పడినట్టు నిరూపించినా మంత్రి పదవికి రాజీనామా చేస్తా: ధర్మాన సవాల్

  • ధర్మాన అవినీతికి పాల్పడ్డారన్న అచ్చెన్నాయుడు
  • నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానన్న ధర్మాన
  • ప్రతిపక్ష నేతలు ఓర్వలేకపోతున్నారంటూ వ్యాఖ్య

ఏపీ టీడీపీ నేత అచ్చెన్నాయుడిపై మంత్రి ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. ఇసుక విషయంలో అవినీతికి పాల్పడ్డారంటూ అచ్చెన్న చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఒక్క రూపాయి అవినీతికి పాల్పడినట్టు రుజువు చేసినా మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు. ప్రజల కోసం ముఖ్యమంత్రి జగన్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే ప్రతిపక్ష నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా కల్లేపల్లిలో ఇసుక వారోత్సవాల్లో భాగంగా ఈరోజు ఇసుక రీచ్ ను ధర్మాన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.

Dharmana Krishnadas
YSRCP
Achennaidu
Telugudesam
  • Loading...

More Telugu News