Bharath-Bangaldesh Test match: టీ విరామ సమయానికి బంగ్లాదేశ్ 191/6

  • ఇంకా 152 పరుగుల ట్రయల్స్ లో బంగ్లా జట్టు
  • షమీకి 3 వికెట్లు, ఇశాంత్, ఉమేష్,అశ్విన్లలకు తలో వికెట్
  • ముష్ఫకిర్ రహీం 53 పరుగులు, మెహిదీ హసన్ 38 పరుగులతో బ్యాటింగ్

ఇండోర్ వేదికగా సాగుతున్న భారత్-బంగ్లా తొలి టెస్ట్ మ్యాచ్ లో పర్యాటక జట్టు ఓటమి కోరల్లో చిక్కుకుంది. మూడో రోజు తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెంట వెంటనే వికెట్లను పోగొట్టుకుంది. భారత బౌలర్ల ధాటికి బంగ్లా బ్యాట్స్ మెన్ మరోసారి తలవంచారు. బంగ్లాదేశ్ 16 పరుగులకే ఓపెనర్ల  వికెట్లను పోగొట్టుకుంది. టీ విరామ సమయానికి బంగ్లా 6 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. భారత బౌలర్లకు ఎదురునిలిచిన బంగ్లా బ్యాట్స్ మెన్ ముష్ఫకిర్ రహీం 53 పరుగులు చేసి క్రీజులో ఉండగా మరోవైపు మెహిదీ హసన్ 38 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇప్పటివరకు షమీ 3 వికెట్లు పడగొట్టగా, ఇశాంత్, ఉమేష్ , అశ్విన్ తలో వికెట్ ను చేజిక్కించుకున్నారు. బంగ్లా జట్టు 152 పరుగుల ట్రయల్స్ లో ఉంది. అంతకు ముందు భారత్ 493/6 పరుగుల వద్ద తన తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే.

Bharath-Bangaldesh Test match
Bangaladesh First Innings
  • Loading...

More Telugu News